మెగా నిర్మాత మళ్ళీ నిప్పు రాజేసాడు
TOLLYWOOD
 TOPSTORY

మెగా నిర్మాత మళ్ళీ నిప్పు రాజేసాడు

Murali R | Published:November 22, 2017, 9:28 AM IST
మెగా కాంపౌండ్ నిర్మాత , అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు మళ్ళీ నిప్పు రాజేసాడు . నంది అవార్డుల పై మొదటగా వివాదాన్ని రాజేసింది ఈ బన్నీ వాసే !నంది అవార్డులను కమ్మ అవార్డులు అంటూ మెగా హీరోలకు అన్యాయం చేసారని ట్వీట్ చేసి వివాదానికి ఆజ్యం పోసిన బన్నీ వాసు ఆ తర్వాత విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో వెనక్కి తగ్గాడు పైగా ఓ ఛానల్ నిర్వహించిన భేటీ లో ఇక వివాదాలను పక్కన పెడతాం అని చెప్పాడు.

కట్ చేస్తే తాజాగా పోసాని నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు రావడంతో మళ్ళీ పోసాని కి మద్దతు చెబుతూ నారా లోకేష్ పై వ్యంగ్య బాణాలు సంధించి మరోసారి నిప్పు రాజేసాడు . పోసాని వ్యాఖ్యలు అలాగే పోసానిని సమర్ధిస్తూ బన్నీ వాసు చేసిన ట్వీట్ మళ్ళీ నంది అవార్డులను అపహాస్యం చేసేలా ఉంది.Comments

FOLLOW
 TOLLYWOOD