ఆ సినిమా చేయనందుకు ఇప్పుడు బాధపడుతోంది
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా చేయనందుకు ఇప్పుడు బాధపడుతోంది

Friday January 13th 2017
చిరంజీవి పక్కన ఐటెం సాంగ్ చేయాలనీ అనగానే ఎగిరి గంతేసింది పాపం కేథరిన్ కానీ ఆ ఆశలు ఎంతో కాలం నిలవలేదు లొకేషన్ కు వెళ్ళింది షూటింగ్ కి రెడీ అయ్యింది ఇక స్టెప్పులు వేయడమే ఆలస్యం మెగా డాటర్ సుస్మిత తో చిన్న పాటి గొడవ అంతే ఖైదీ నెంబర్ 150 నుండి కేథరిన్ అవుట్ అయ్యింది . దాంతో ఆ ఛాన్స్ రాయ్ లక్ష్మీ కి వచ్చింది . కట్ చేస్తే కేథరిన్ ఇప్పుడు కుమిలి కుమిలి పోతోంది .

ఆరోజు కొద్దిగా తగ్గి ఉంటే బాగుండేది కదా ! అంటూ తెగ ఇదై పోతోందట కేథరిన్ ట్రెసా . ఎందుకంటే రత్తాలు రత్తాలు సాంగ్ తెగ పాపులర్ కావడమే కాక రాయ్ లక్ష్మీ కి కూడా ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది పైగా సినిమా ప్రమోషన్ లో రత్తాలు సాంగ్ కి కూడా ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు ఫీల్ అవుతోందట కేథరిన్ పాపం . అల్లు అర్జున్ రికమండేషన్ తో ఛాన్స్ వచ్చింది కానీ ఆ ఛాన్స్ ని నిలుపుకోలేక పోయింది కేథరిన్ .


Comments

FOLLOW
 TOLLYWOOD