అల్లు అర్జున్ భామతో ఆ హీరో
TOLLYWOOD
 TOPSTORY

అల్లు అర్జున్ భామతో ఆ హీరో

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
అల్లు అర్జున్ కు కేథరిన్ ట్రెసా ప్రత్యేకం అన్న విషయం అందరికీ తెలిసిందే . మొదట ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు కేథరిన్ కు ఆ తర్వాత రుద్రమదేవి చిత్రంలో దాని తర్వాత సరైనోడు చిత్రంలో ఇలా మొత్తంగా మూడు చిత్రాల్లో తన సరసన ఛాన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ . ఆ తర్వాత బన్నీ రికమండేషన్ తో చిరంజీవి 150 వ చిత్రమైన ఖైదీ నెంబర్ 150 లో కేథరిన్ కు ఐటెం సాంగ్ లో చేసే ఛాన్స్ వచ్చింది కానీ చిరు కూతురు సుస్మిత తో తేడా రావడం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యింది . కట్ చేస్తే ఇప్పుడు కేథరిన్ కు బోయపాటి సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో ఐటెం సాంగ్ కేథరిన్ ట్రెసా చేత చేపిస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట దర్శక నిర్మాతలు . ఇంకేముంది మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సినిమాలో ఛాన్స్ అంటే వదులుకుంటుందా ? అందుకే ఒప్పేసుకుంది కేథరిన్ . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆడి పాడటానికి రెడీ అయ్యింది కేథరిన్.Comments

FOLLOW
 TOLLYWOOD