అల్లు అర్జున్ భామని ఆ సినిమాలోంచి తీసేసారు
TOLLYWOOD
 TOPSTORY

అల్లు అర్జున్ భామని ఆ సినిమాలోంచి తీసేసారు

Murali R | Published:October 12, 2017, 6:20 PM IST
అల్లు అర్జున్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేసింది కేథరిన్ ట్రెసా . దాంతో ఆ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది . మొదటగా ఇద్దరమ్మాయిలతో చిత్రంలో కలిసి నటించారు దాని తర్వాత రుద్రమదేవి చిత్రంలో అలాగే సరైనోడు చిత్రంలో కూడా అల్లు అర్జున్ కేథరిన్ నటించారు . ఇటీవలే రానా సరసన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటించింది , ఆ సినిమా హిట్ కావడంతో ఈ భామకు కాస్త క్రేజ్ వచ్చింది కూడా.

ఇంకేముంది ఛాన్స్ లు కూడా వచ్చి పడుతున్నాయి వరుసగా అదే జోరులో తమిళంలో హిట్ అయిన భోగన్ చిత్రాన్ని తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసారు . కాగా ఆ చిత్రంలో రవితేజ సరసన కేథరిన్ ని ఎంపిక చేసారు . దాంతో చాలా సంతోషపడింది కూడా . కానీ ఆ సంతోషాన్ని ఎంతోసేపు లేకుండా  చేసింది కాజల్ అగర్వాల్ . రవితేజ సరసన కేథరిన్ కాదని కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసేసారు . కేథరిన్ ని తీసేయడంతో షాక్ అయ్యిందట పాపం.Comments

FOLLOW
 TOLLYWOOD