పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసిన చరణ్
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసిన చరణ్

Murali R | Published:March 19, 2017, 12:00 AM IST
బాబాయ్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు ట్రైలర్ నిన్న రిలీజ్ కావడంతో దానిపై స్పందించాడు అబ్బాయ్ రాంచరణ్ తేజ్ . తన పేస్ బుక్ లో కాటమ రాయుడు ట్రైలర్ లింక్ పెట్టేసి '' మన అందరి కాటమ రాయుడు మార్చి 24 న థియేటర్ లలోకి వస్తున్నాడు ...... ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలెబ్రేషన్ లా ఉంది అంటూ కామెంట్ చేసాడు చరణ్ . గతకొద్ది రోజులుగా అన్నయ్య కుటుంబం తో తమ్ముడికి అంతగా పొసగడం లేదు అని అనుకుంటున్న సమయంలో అందునా కాటమ రాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా కుటుంబం నుండి ఒక్క పవన్ తప్ప మరొక హీరో అంటూ ఎవరూ లేకపోవడంతో కొంత నిరాశ కు గురయ్యారు మెగా ఫ్యాన్స్ . 
 
 

అయితే అదే సమయంలో చరణ్ బాబాయ్ సినిమా గురించి కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు . అన్నయ్య సంక్రాంతి రేసులో ఘనవిజయం సాధించగా తమ్ముడు వేసవి బరిలో ఉగాది కానుకగా వస్తున్నాడు .
Comments

FOLLOW
 TOLLYWOOD