బోయపాటికి షాక్ ఇచ్చిన చరణ్
TOLLYWOOD
 TOPSTORY

బోయపాటికి షాక్ ఇచ్చిన చరణ్

Murali R | Published:December 9, 2017, 4:22 AM IST

మాస్ దర్శకులు బోయపాటి శ్రీను కు షాక్ ఇచ్చాడు మెగా హీరో రాంచరణ్ తేజ్ . తాజాగా ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు పైగా సినిమా ఇటీవలే ప్రారంభం కూడా అయిన విషయం తెలిసిందే . బోయపాటి చెప్పిన కథ చరణ్ కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడు అందుకే సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు కొన్ని మార్పులు చేయమని స్పష్టం చేసాడట రాంచరణ్ తేజ్ దాంతో షాక్ అయ్యాడు బోయపాటి . 

కథ చెప్పినప్పుడు ఓకే అని ఇప్పుడేమో స్క్రిప్ట్ లో మార్పులు ఏంటి అని తల పట్టుకుంటున్నాడట బోయపాటి శ్రీను . ఈ దర్శకుడు బాలయ్య తో చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది . భారీ బడ్జెట్ తో చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చరణ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట అందుకే స్క్రిప్ట్ లో మార్పులు కోరుతున్నాడు . మరి బోయపాటి ఏం చేస్తాడో చూడాలి .
Comments

FOLLOW
 TOLLYWOOD