చరణ్ ఏమన్నాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ ఏమన్నాడో తెలుసా

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
సినిమాలు వదిలేసి మళ్ళీ కాలేజ్ లో చేరాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో రాంచరణ్ . నిన్న విజయనగరం తగరపువలస లోని ఓ కాలేజ్ ఫంక్షన్ లో పాల్గొనడానికి వెళ్లిన చరణ్ అక్కడి యువత ని ఉద్దేశించి వాళ్ళని ఆకాశానికి ఎత్తేసాడు . యూత్ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే నని అయితే ఆ శక్తి ని కేవలం మంచి పనుల కోసమే ఉపయోగించాలని చెప్పాడు చరణ్ . మిమ్మల్ని చుస్తే అసూయ గా ఉందని నాకు సినిమాలు మానేసి మళ్ళీ కాలేజ్ లో చేరాలని ఉందని వాళ్లలో మరింత జోష్ పెంచాడు .
 
 

చిరుత సినిమాలో నటించే ముందు బికాం ని మధ్యలోనే మానేసాడు చరణ్ . సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు అయితే చదువు విషయం వస్తే మాత్రం అప్పుడప్పుడు బాధ పడుతూనే ఉంటాడట చరణ్ . ఇటీవలే నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్ తాజాగా సుకుమార్ చిత్రంలో నటిస్తున్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD