చరణ్ - బోయపాటి ల సినిమా ఎప్పటినుండో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ - బోయపాటి ల సినిమా ఎప్పటినుండో తెలుసా

Murali R | Published:October 16, 2017, 2:08 PM IST
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని మాస్ దర్శకులు బోయపాటి శ్రీను తో చేయడానికి రెడీ అవుతున్నాడు . తీవ్ర తర్జన భర్జన అనంతరం బోయపాటి శ్రీను సినిమాని ఓకే చేసాడు చరణ్ . రంగస్థలం 1985 వంటి విభిన్న చిత్రం తర్వాత బోయపాటి తో సినిమా చేస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట అందుకే ఆ సినిమాని వెంటనే పట్టాలెక్కించడానికి టైం కూడా ఫిక్స్ చేసాడు . వచ్చే ఏడాది జనవరి లో చరణ్ - బోయపాటి ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈలోపు రంగస్థలం 1985 చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు చరణ్ . సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే . సమంత నాయికగా నటిస్తున్న ఆ చిత్రంలోహాట్ భామ  అనసూయ కూడా నటిస్తోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే సినిమాతో వసూళ్లు కుమ్మేసే సినిమా రావడం ఖాయమని ధీమాగా ఉన్నాడు చరణ్ . అయితే బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక ఘోర పరాజయం పొందింది మరి.Comments

FOLLOW
 TOLLYWOOD