చరణ్ తదుపరి చిత్రాలు ఏంటో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ తదుపరి చిత్రాలు ఏంటో తెలుసా

Murali R | Published:January 11, 2017, 12:00 AM IST
మెగా స్టార్ చిరంజీవి వారసుడు రాంచరణ్ తేజ్ ఇటీవల ధృవ చిత్రంతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే . దాని తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి పలు చిత్రాలను లైన్లో పెట్టాడు చరణ్ . ఇంతకీ చరణ్ తదుపరి చిత్రాలు ఏంటో తెలుసా ........ ధృవ హిట్ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చరణ్ . వాటిలో ముందుగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఇక దాని తర్వాత కొరటాల శివ తో ఓ సినిమా చేయనున్నాడు , అసలు కొరటాల శివ మిర్చి తర్వాత చరణ్ తో ఓ సినిమా ప్రారంభం కూడా జరిగింది కానీ షూటింగ్ మాత్రం ఆగిపోయింది ఎందుకంటే కథ లో ఎక్కడో చరణ్ కు అలాగే కొరటాల శివ కు చిన్న డౌట్ ఉండెనట అందుకే ఆ సినిమా ఆగిపోయింది అయితే దాని తర్వాత సినిమా చేయాలనుకున్నాడు కానీ ఇద్దరూ బిజీ గా ఉండటం వల్ల కుదరలేదు ఇక ఇప్పుడు వీలు చేసుకుంటున్నారు . ఆ తర్వాత  సీనియర్ దర్శకులు మణిరత్నంతో ఓ సినిమా చేయడానికి కూడా అంగీకరించాడట . ఇలా వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు చరణ్ .Comments

FOLLOW
 TOLLYWOOD