జయ జానకి నాయక మేనేజర్ పై కేసు
TOLLYWOOD
 TOPSTORY

జయ జానకి నాయక మేనేజర్ పై కేసు

Thursday August 17th 2017
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక చిత్రం ఘోర పరాజయం పొందగా ఇప్పుడు కేసు తో వివాదంలో చిక్కుకుంది . అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా కోసం చిత్రీకరించిన పాట కోసం పెద్ద ఎత్తున ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్ల ని కాయిన్ లైట్ల ని తెప్పించి ఆ డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా డబ్బులు అడిగినందుకు చంపేస్తా అని ఆ సినిమా మేనేజర్ బెదిరించడం తో కిషోర్ అనే మేనేజర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు .
 

మొత్తం పది లక్షల 75 వేలకు ఈ లైట్ల ని అద్దె కి ఇచ్చాడు అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో కేసు వరకు వెళ్ళింది వ్యవహారం . అయితే ఇదే సంఘటన పై అప్పట్లో బెల్లంకొండ సురేష్ - పెద్ది రెడ్డి అశోక్ రెడ్డి లు పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది వ్యవహారం కట్ చేస్తే ఇప్పుడు బెల్లంకొండ సురేష్ స్థానంలో మేనేజర్ పై కేసు నమోదు అయ్యింది . ఇందులో మతలబు ఏంటో ? Comments

FOLLOW
 TOLLYWOOD