చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడట
TOLLYWOOD
 TOPSTORY

చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడట

Murali R | Published:November 14, 2017, 11:27 AM IST
సైరా ..... నరసింహారెడ్డి చిత్రం ఎప్పుడో ఆగస్ట్ లో ప్రారంభం అయ్యింది కానీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు , నవంబర్ నెల కూడా సగం అయిపొయింది కానీ సైరా షూటింగ్ ఎప్పుడో ఇదమిద్దంగా తెలియడం లేదు అందుకు కారణం ఏంటో తెలుసా  ..... ..... స్క్రిప్ట్ వర్క్ లో నెలకొన్న గందరగోలమే ! అసలు నరసింహారెడ్డి కథ ని పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో రాసారు చిరంజీవి సూచనల మేరకు స్వల్ప మార్పులు చేసారు కూడా కానీ ఇప్పుడు రైటర్ గా వెలుగులోకి వచ్చిన రచయిత బుర్రా సాయి మాధవ్ దాంతో అతడ్ని కూడా తీసుకొచ్చి స్క్రిప్ట్ లో కూర్చోబెట్తారట అక్కడే తేడా కొట్టింది . 
 
 
 
పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే ఒకలా ఉంటే సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే మరోలా ఉంది దాంతో దర్శకుడు సురేందర్ రెడ్డి కి పరుచూరి బ్రదర్స్ కు తేడా లు వచ్చాయి ఇంకేముంది ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళడంతో అందరికీ క్లాస్ పీకాడట అంతేకాదు వారం , పది రోజుల్లో అసలు విషయం చెప్పమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. దాంతో చేసేది లేక అందరూ ఒకే స్క్రిప్ట్ కి పదును పెట్టె పనిలో ఉన్నారట ! ఇది ఓ కొలిక్కి వస్తే డిసెంబర్ నెలాఖరు లో సెట్స్ మీదకు వెలుతుందేమో .Comments

FOLLOW
 TOLLYWOOD