3 టికెట్లకు 36 లక్షలు పెట్టిన మెగా ఫ్యాన్
TOLLYWOOD
 TOPSTORY

3 టికెట్లకు 36 లక్షలు పెట్టిన మెగా ఫ్యాన్

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST
కేవలం మూడు టికెట్ల కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు ఓ మెగా వీరాభిమాని దాంతో ఆ థియేటర్ యాజమాన్యం షాక్ అయ్యిందట . ఈ షాకింగ్ సంఘటన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది . బెంగుళూరు లో ఓ థియేటర్ యాజమాన్యం మొదటి మూడు టికెట్ల ని వేలానికి పెట్టింది అయితే మెగా వీరాభిమాని ఒకరు ఏకంగా ఆ మూడు టికెట్ల ని తానే వేలం పాడాడు . అది కూడా 36 లక్షలు చెల్లించడానికి ముందుకు రావడంతో అంతా షాక్ అయ్యారు .

చిరంజీవి ఛరిస్మా ఇంకా తగ్గలేదు అనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణ . మూడు టికెట్ల కు భారీ మొత్తం లో డబ్బు వచ్చింది కాబట్టి ఆ సొమ్ము ని అనాధ పిల్లల సహాయం  కోసం వినియోగిస్తామని థియేటర్ యాజమాన్యం తెలిపింది . వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150  చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు .Comments

FOLLOW
 TOLLYWOOD