ఆ డైలాగ్ వివాదం సృష్టించడం ఖాయం
TOLLYWOOD
 TOPSTORY

ఆ డైలాగ్ వివాదం సృష్టించడం ఖాయం

Murali R | Published:February 13, 2017, 12:00 AM IST
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ''విన్నర్ ''. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది . మాస్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించిన ఈ ట్రైలర్ లో ''ప్రత్యేక హోదా '' గురించి ఓ డైలాగ్ ఉంది అది కూడా హీరోయిన్ ని ఉద్దేశించి హీరో చెప్పే డైలాగ్ కావడంతో దాన్ని సెన్సార్ వాళ్ళు కట్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు . అసలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ప్రజలు ప్రత్యేక హోదా కోసం గళమెత్తు తున్నారు , పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి సమయంలో ఈ డైలాగ్ తప్పకుండా వివాదాస్పదం అవడం ఖాయం.

సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఈనెల 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క ఘోర పరాజయం పొందడంతో ఈ విన్నర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు.Comments

FOLLOW
 TOLLYWOOD