ఎన్టీఆర్ కు అవార్డు ఎందుకిచ్చారో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ కు అవార్డు ఎందుకిచ్చారో తెలుసా

Murali R | Published:November 17, 2017, 5:24 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016 వ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఈ అవార్డు ఒక్క సినిమాకు మాత్రమే కాకుండా నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలకు గాను కలిపి ఇచ్చారు . అయితే సరిగ్గా అదే సమయంలో ఇతర సినిమాలు కూడా ఉన్నాయి కానీ వాటిని పక్కన పెట్టి కావాలని జూనియర్ ఎన్టీఆర్ ని మచ్చిక చేసుకోవడానికి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారని గోల గోల చేస్తున్నారు.

ఇక కొంతమంది అయితే ప్రభాస్ కు అన్యాయం చేసి మరీ జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు ప్రకటించారని అంటున్నారు . అయితే లోగుట్టు పెరుమాళ్ళ కెరుక కానీ చంద్రబాబు వ్యూహం ప్రకారం 2019 లో ఎన్నికలు వస్తున్నందున ఎన్టీఆర్ కూడా మా వెంటే ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికీ నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాల్లో మాత్రం కొత్త ఎన్టీఆర్ కనిపించాడు అలాగే నటనలో కూడా భేషుగ్గా రాణించాడు కాబట్టి ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది అనడంలో సందేహం లేదు.Comments

FOLLOW
 TOLLYWOOD