జై లవకుశ సినిమా కాపీ కథ అంట
TOLLYWOOD
 TOPSTORY

జై లవకుశ సినిమా కాపీ కథ అంట

Murali R | Published:August 30, 2017, 12:00 AM IST
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న జై లవకుశ చిత్రంపై అప్పుడే నెగెటివ్ ప్రచారం మొదలయ్యింది . జై లవకుశ చిత్రం హాలీవుడ్ చిత్రం '' ది గుడ్ ది బ్యాడ్ ది అగ్లీ '' అనే చిత్రానికి కాపీ అంటూ ప్రచారం సాగుతోంది . పేరుకి తగ్గట్లుగానే ఆ హాలీవుడ్ చిత్రం మూడు విభిన్న పాత్రల నేపథ్యంలో తెరకెక్కింది , ఇక ఆ ఊహాగానాలకు తగ్గట్లుగా ఎన్టీఆర్ జై లవకుశ కూడా మూడు విభిన్న పాత్రలు కావడం హాలీవుడ్ టైటిల్ ని పోలిన పాత్రలు కావడంతో ఈ వార్తలు మరీ ఎక్కువ అవుతున్నాయి.

అయితే ఈ వార్తలపై జై లవకుశ యూనిట్ ఇంకా స్పందించలేదు , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో వాళ్ళు చాలా బిజీ గా ఉన్నారు . దర్శకులు బాబీ హాలీవుడ్ సినిమా నుండి స్ఫూర్తి పొంది ఈ కథ రాసానని చెబుతాడా ? లేక లేదు ఇది పూర్తిగా నేను కస్టపడి రాసుకున్న కథ అని చెబుతాడా చూడాలి . ఈ వివాదం సంగతి ఎలా ఉన్నప్పటికీ జై లవకుశ పై మాత్రం ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు . మరో హిట్ కొట్టడం ఖాయమని . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ వంటి వరుస సూపర్ హిట్ లతో మంచి జోష్ మీదున్నాడు ఎన్టీఆర్.

Related Links

ntr jai lavakusa teaser ready
tamannah item song in ntr jai lavakusa
NTR Jai Lavakusha latest newsComments

FOLLOW
 TOLLYWOOD