రానా తమ్ముడు కూడా హీరో అవుతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

రానా తమ్ముడు కూడా హీరో అవుతున్నాడు

Murali R | Published:October 21, 2017, 9:23 PM IST
తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవ లేదన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే పలువురు వారసులు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు , ఇక ఇప్పుడు ఆ కోవలోకి మరో హీరో వస్తున్నాడు . హీరో దగ్గుబాటి రానా సోదరుడు , అగ్ర నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు అయిన అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు . దర్శకుడు భానుశంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అభిరాం ని హీరోగా పరిచయం చేయాలనీ భావిస్తున్నారట . ఆమేరకు చర్చలు కూడా పూర్తయ్యాయి.

భానుశంకర్ ఇంతకుముందు మూడు సినిమాలు చేసాడు , ఫరవాలేదనిపించాయి ఆ సినిమాలు కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు దాంతో ఈసారి హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాకు నడుం బిగించాడు . అభిరాం ని ఇప్పట్లో సినిమాల్లోకి తీసుకువచ్చేది లేదని అప్పట్లో నిర్మాత సురేష్ బాబు అన్నాడు కానీ అభిరాం కు మాత్రం సినిమాల్లోకి రావాలని హీరో కావాలని ఆశ ఉండేది . మరి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD