విలన్ గా మారుతున్న దాసరి కొడుకు
TOLLYWOOD
 TOPSTORY

విలన్ గా మారుతున్న దాసరి కొడుకు

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST

దర్శక రత్న దాసరి నారాయణరావు రెండో కొడుకు దాసరి అరుణ్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అయితే హీరోగా అయితే పరిచయం అయ్యాడు కానీ పాపం సక్సెస్ కాలేకపోయాడు దాంతో దాసరి తీవ్ర స్థాయిలో బాధ పడ్డాడు . ఎంతోమందికి స్టార్ డం కట్టబెట్టాను కానీ కొడుకు ని హీరోగా నిలబెట్టలేక పోయానే అని . దాసరి అరుణ్ కొన్ని సినిమాలు చేసాడు కానీ పాపం ఏ గ్రహచారమో కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు .

 

దాంతో తెరమరుగు అయ్యాడు . కట్ చేస్తే దాసరి నారాయణరావు లేడు దాంతో ఆ లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అందుకే నాన్న కోరిక నెరవేర్చాలని ఉందని అయితే హీరోగా అడిగితే ఛాన్స్ లు ఇవ్వరు కాబట్టి విలన్ క్యారెక్టర్స్ చేస్తానని అంటున్నాడు దాసరి అరుణ్ . మరి దాసరి వారసుడికి ఛాన్స్ లు ఇస్తారా చూడాలి .
Comments

FOLLOW
 TOLLYWOOD