నవంబర్ మొదటివారం నుండి 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం
TOLLYWOOD
 TOPSTORY

నవంబర్ మొదటివారం నుండి 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం

Murali R | Published:October 24, 2017, 4:57 PM IST
సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం 'దేశదిమ్మరి'. నగేష్ నారదాశి దర్శకత్వంలో తనీష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుంచి నెల రోజులపాటు పంజాబ్, హర్యానా, సిమ్లా తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోబోతోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భముగా..'శ్రీ సత్యనారాయణ స్వామి' పౌరాణిక చిత్రంగా, 'కిల్లర్' క్రైం థ్రిల్లర్ గా, 'బ్యాండ్ బాజా' ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, 'లవ్ బూమ్' యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మలిచిన నగేష్ నారదాశి మానవత్వ  విలువలను చాటి చెప్పే ఈ దేశదిమ్మరి చిత్రాన్ని సరికొత్త కోణంలో తెరకెక్కించబోతోన్న

దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ.. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది తప్ప.. అత్యాశను కాదు అనే సిద్దాంతాన్ని నమ్మే ఓ యువకుడు డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే వైవిధ్యభరితమైన కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు.
Comments

FOLLOW
 TOLLYWOOD