అమితాబ్ కి గాయాలు
TOLLYWOOD
 TOPSTORY

అమితాబ్ కి గాయాలు

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో గాయపడ్డాడు , దాంతో పక్కటెముకలు విరిగిపోయాయి . ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న '' తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ '' అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు . షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ కిందపడటంతో పక్కటెముకలు విరిపోయాయి . అయితే ఆ నొప్పి ని భరిస్తూనే బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ ని పూర్తిచేసాడు.

షూటింగ్ ముగించుకొని ఇంటికి చేరుకున్నాక డాక్టర్లు పరీక్షించి పక్కటెముకలలో చీలిక వచ్చినట్లు గుర్తించారు . ఎం ఆర్ ఐ స్కానింగ్ లో ఈ విషయం స్పష్టం కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అమితాబ్ . గతంలో కూడా అమితాబ్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై మృత్యువు ని జయించాడు . అమితాబ్ కి గాయాలు అయ్యాయి అని తెలియడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.Comments

FOLLOW
 TOLLYWOOD