13 మంది హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన సినిమానట
TOLLYWOOD
 TOPSTORY

13 మంది హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన సినిమానట

Murali R | Published:November 14, 2017, 1:06 PM IST
హీరోయిన్ ని రేప్ చేసే సినిమా ఏంటి ? ఇది వల్గర్ సినిమానే అని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది హీరోయిన్ లు ''దేవిశ్రీ ప్రసాద్ '' అనే సినిమాలో నటించడానికి నిరాకరించారట ! ఈ విషయాన్ని ధన్ రాజ్ తాజాగా వెల్లడించాడు . అయితే 13 మంది హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన పాత్ర ని తమిళ నటి పూజా రామచంద్రన్ ఒప్పుకోవడమే కాకుండా  ఛాలెంజ్ గా తీసుకొని నటించి ఇప్పుడు అందరి చూపు తనపై ఉండేలా చేసుకుంది . పూజా రామచంద్రన్ అనే భామ తమిళ చిత్రాల్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవీ అంతగా ఆడలేదు . ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ ఈ భామకు అంతగా పేరు రాలేదు . 
 
 
 
శ్రీ కిషోర్ చెప్పిన పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో తప్పకుండా తన కెరీర్ కు దేవిశ్రీ ప్రసాద్ బ్రేక్ నివ్వడం ఖాయమని నమ్ముతోంది పూజా రామచంద్రన్ . ధన్ రాజ్ , మనోజ్ నందం , భూపాల్ లు కీలక పాత్ర ల్లో నటించిన దేవిశ్రీ ప్రసాద్ ఈనెల 17న రిలీజ్ అవుతోంది . సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం , అలాగే పూజా రామచంద్రన్ కూడా . Comments

FOLLOW
 TOLLYWOOD