తమిళ్ లో భారీ విజయం దిశగా విఐపి 2
TOLLYWOOD
 TOPSTORY

తమిళ్ లో భారీ విజయం దిశగా విఐపి 2

Murali R | Published:August 17, 2017, 12:00 AM IST
ధనుష్ హీరోగా నటించిన వి ఐ పి 2 గత శుక్రవారం రిలీజ్ అయి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది . తొలి వీకెండ్ లో ఏకంగా 45 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించింది . తెలుగు , తమిళ , హిందీ లలో ఏకకాలంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ బిజినెస్ పరంగా అనుకున్న విధంగా సేల్స్ కాకపోవడంతో మొదట తమిళంలో రిలీజ్ చేసారు . తమిళంలో రివ్యూలు యావరేజ్ గా వచ్చాయి కానీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి దాంతో హిందీ , తెలుగులలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ధనుష్ - అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ భామ కాజోల్ నటించింది . ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ధనుష్ మరదలు సౌందర్య రజనీకాంత్ . వి ఐ పి సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది . మొదటి వీకెండ్ లోనే 50 కోట్ల వైపు దూసుకెళుతూ భారీ విజయం సాధించేలా ఉంది.Comments

FOLLOW
 TOLLYWOOD