దర్శక నిర్మాత కన్నుమూత
TOLLYWOOD
 TOPSTORY

దర్శక నిర్మాత కన్నుమూత

Murali R | Published:December 14, 2017, 4:46 AM IST
ప్రముఖ దర్శక నిర్మాత నీరజ్ ఓరా (54) కన్నుమూశారు . గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వోరా ఈరోజు తెల్లవారు ఝామున తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు . అమీర్ ఖాన్ నటించిన '' రంగీలా '' చిత్రానికి రచన అందించిన నీరజ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది . రంగీలా స్పూర్తితో పలు హిట్ చిత్రాలకు పనిచేసాడు .

 

కిలాడీ 420 చిత్రంతో దర్శకుడిగా కూడా మారాడు అలాగే స్వీయ నిర్మాణంలో చిత్రాన్ని కూడా నిర్మించాడు . గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మంచాన పడ్డాడు . అయితే చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించి ఈరోజు ఉదయం చనిపోయాడు నీరజ్ వోరా . నీరజ్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది . పలువురు ప్రముఖులు నీరజ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .
Comments

FOLLOW
 TOLLYWOOD