అనిల్ రావిపూడి కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

అనిల్ రావిపూడి కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా

Murali R | Published:October 21, 2017, 11:30 AM IST
నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ వంటి సూపర్ హిట్ ని , సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ వంటి హిట్ ని ఇచ్చిన అనిల్ రావిపూడి తాజాగా రవితేజ కు రాజా ది గ్రేట్ వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చి హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. వరుసగా మూడు చిత్రాలు హిట్ కొట్టడంతో అనిల్ రావిపూడి కి మంచి డిమాండ్ ఏర్పడింది . అతడితో పలువురు హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ అనిల్ రావిపూడి దృష్టి మాత్రం ఎన్టీఆర్ పై ఉంది . ఎన్టీఆర్ స్టార్ హీరో అందునా మాస్ లో బాగా పట్టున్న హీరో కావడంతో అతడి తో సినిమా చేయాలనీ ఇంతకుముందే వెళ్ళాడు కథ చెప్పాడు కానీ ఎన్టీఆర్ మాత్రం నో చెప్పాడు . 
 
 
ఇంకా బెటర్ కథ ఉంటే తీసుకురా అంటూ చెప్పాడట ! దాంతో మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఎన్టీఆర్ కోసం . రాజా ది గ్రేట్ వంటి హిట్ ఇచ్చాక కూడా ఎన్టీఆర్ అనిల్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా ? లేక ఛాన్స్ ఇస్తాడా ? చూడాలి . అనిల్ రావిపూడి మాత్రం ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు . ఎన్టీఆర్ తో చేస్తే అది హిట్ అయితే అప్పుడు స్టార్ డైరెక్టర్ ల రేంజ్ లోకి వెళ్తాడు కదా ! అదన్న మాట అనిల్ వ్యూహం . Comments

FOLLOW
 TOLLYWOOD