ఎన్టీఆర్ ని విమర్శించాడు ఇప్పుడేమో
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ ని విమర్శించాడు ఇప్పుడేమో

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST

ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అంటూ ఎదురు ప్రశ్న వేసిన తమిళ దర్శకులు హరి ఇప్పుడేమో హైదరాబాద్ కు రాగానే ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అని అతడితో సినిమా చేయడానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని స్పష్టం చేశాడు. దాంతో అవాక్కవడం అందరి వంతు అయ్యింది.  ఇటీవల హరి దర్శకత్వం వహించిన చిత్రం సింగం 3.

ఆ సినిమాలో సూర్య హీరో . తమిళ స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన హరి ఎన్టీఆర్ నటించిన టెంపర్ చూశానని చాలా బాగా నచ్చిందని తప్పకుండా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ కొసం ఎదురు చూస్తున్నాని అంటున్నాడు.

మరి ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD