ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న డైరెక్టర్
TOLLYWOOD
 TOPSTORY

ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న డైరెక్టర్

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
తెలుగు సినిమా దర్శకులకు ఓ సెంటిమెంట్ విపరీతంగా భయపెడుతుంది అదేంటో తెలుసా ....... ...... రెండో సినిమా . మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యాక చేసిన రెండో సినిమా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవడంతో కెరీర్ లో పెద్ద దెబ్బలే తిన్నారు . కాగా ఇప్పుడు అదే సెంటిమెంట్ తో భయపడుతున్నాడు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ . మొదటి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు తాజాగా నాగచైతన్య తో '' రారండోయ్ వేడుక చూద్దాం '' సినిమా చేసాడు.

ఆ సినిమా ఈనెల 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది . అయితే రెండో సినిమా రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో భయం పట్టుకుంది కళ్యాణ్ కృష్ణ కు . సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే ! మరి ఈ కళ్యాణ్ కృష్ణ ఏ లిస్టులో చేరతాడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.Comments

FOLLOW
 TOLLYWOOD