దండుపాళ్యం 3 పై ధీమాగా ఉన్న డైరెక్టర్
TOLLYWOOD
 TOPSTORY

దండుపాళ్యం 3 పై ధీమాగా ఉన్న డైరెక్టర్

Murali R | Published:December 17, 2017, 11:03 AM IST

దండుపాళ్యం చిత్రంతో కన్నడ చిత్రరంగంలో సంచలనం సృష్టించిన దర్శకులు శ్రీనివాసరాజు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా తెలుగులో సైతం సంచలన విజయం సాధించింది. వాస్తవ సంఘటన ల ఆధారంగా తెరకెక్కిన దండుపాళ్యం చిత్రానికి ఆదరణ అద్భుతంగా లభించడంతో దానికి సీక్వెల్ చేసాడు శ్రీనివాసరాజు. తెలుగు , కన్నడ భాషల్లో రూపొందిన దండుపాళ్యం 2 అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది కానీ కొంతవరకు టెంపో ని మెయింటైన్ చేసింది. అలాగే అంతకుమించిన వివాదాన్ని కూడా సృష్టించింది.

 

కట్ చేస్తే ......ఇప్పుడు దండుపాళ్యం 3 వస్తోంది. దండుపాళ్యం లాగే దండుపాళ్యం 3 సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నాడు దర్శకులు శ్రీనివాసరాజు. వచ్చే ఏడాది జనవరి 25న దండుపాళ్యం 3 ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం. పూజా గాంధీ ప్రధాన పాత్ర పోషించిన దండుపాళ్యం 3 పై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఫలితం ఏంటన్నది తెలియాలంటే జనవరి 25 వరకు ఎదురుచూడాల్సిందే.
Comments

FOLLOW
 TOLLYWOOD