గల్ఫ్ బాధితుల న్యాయం కోసమే ఈ గల్ఫ్
TOLLYWOOD
 TOPSTORY

గల్ఫ్ బాధితుల న్యాయం కోసమే ఈ గల్ఫ్

Murali R | Published:October 12, 2017, 2:54 PM IST
మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మన దేశం లోని ఇతర ప్రాంతాల నుండి కూడా గల్ఫ్ కు ఎక్కువగా వెళుతున్నారు , అయితే అందులో ఎక్కువ సంఖ్యలో మన తెలుగువాళ్లు ఉండటం విశేషం . గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బాగా సంపాదించి తిరిగి సొంత ఊరుకి వద్దామని ఆశగా వెళ్లి గల్ఫ్ లో బాధలు పడుతున్న వాళ్ళు కోకొల్లలు . గల్ఫ్ దేశంలో నరకయాతన అనుభవిస్తున్న వారి వెతలు భారతదేశ ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు చాటి చెప్పాలనే మహాసంకల్పంతో సునీల్ కుమార్ రెడ్డి సందేశాత్మకంగా రూపొందించిన చిత్రం గల్ఫ్ . 
 
 

రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 స్క్రీన్ లలో రిలీజ్ అవుతోంది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో సైతం గల్ఫ్ సినిమా రిలీజ్ అవుతోంది . చేతన్ - డింపుల్ హయతి జంటగా నటించగా శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రవీంద్ర బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు . ప్రేమకథా చిత్రానికి సామాజిక అంశాన్ని చేర్చి హృదయానికి హత్తుకునేలా సినిమా చేశామని అలాగే గల్ఫ్ బాధితుల కష్టాలు మన ప్రభుత్వాలకు తెలియాలనే ఈ సినిమా చేశామని చెబుతున్నాడు దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి . గంగపుత్రులు వంటి సామజిక స్పృహ ఉన్న చిత్రాన్ని ఒక రొమాంటిక్ క్రైమ్ కథ వంటి కమర్షియల్ హిట్ తో విభిన్న కథా చిత్రాలను హేండిల్ చేయగలను అని నిరూపించుకున్న సునీల్ రెడ్డి నుండి వస్తున్న మరో ప్రయోగం ఈ గల్ఫ్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD