ఆ సినిమా పరమ చెత్త గా ఉంది
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా పరమ చెత్త గా ఉంది

Murali R | Published:September 15, 2017, 12:00 AM IST
నారా రోహిత్ , నాగ శౌర్య కలిసి నటించిన చిత్రం '' కథలో రాజకుమారి ''. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన చిత్రాలు మంచి హిట్ సాధించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు పెట్టుకున్నారు . కానీ ఈరోజు రిలీజ్ అయిన కథలో రాజకుమారి కి డిజాస్టర్ టాక్ వచ్చింది . కనీసం షార్ట్ ఫిలిం లాగా కూడా లేదని ఆ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు . థియేటర్ లో పెట్టి మక్కెలు ఇరగ తీసినట్లుగా ఉందని ఎందుకొచ్చాం రా ..... ఈ సినిమాకు అని వెళ్లిన వాళ్ళు కుమిలి పోతున్నారు.

మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ , కథనం అంటూ ఏమి లేక పోవడంతో డైరెక్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు . ఇక ఈ సినిమా కొన్ని చోట్ల పడలేదు ఉన్న చోట్ల జనాలు లేరు . ఉన్న జనాలు ఎందుకొచ్చాం రా బాబూ అంటూ ఏడుపు ఒక్కటే తక్కువ అంతగా బాధపడుతున్నారు ప్రేక్షకులు.Comments

FOLLOW
 TOLLYWOOD