8 కోట్ల షేర్ రాబట్టిన గరుడ వేగ
TOLLYWOOD
 TOPSTORY

8 కోట్ల షేర్ రాబట్టిన గరుడ వేగ

Murali R | Published:December 14, 2017, 4:37 AM IST
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ చాలాకాలం తర్వాత నటించిన సూపర్ హిట్ చిత్రం పీఎస్ వి గరుడవేగ . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసారు . ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన గరుడ వేగ సూపర్

హిట్ అయి రాజశేఖర్ కు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలా చేసింది .

 

అయితే దాదాపు 18 కోట్ల బడ్జెట్ పెట్టడం వల్ల ఎక్కువ సొమ్ము తిరిగి రాలేదు కానీ ఇతరత్రా లాభాలతో మంచి లాభాలు వచ్చినట్లే ! ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టింది గరుడ వేగ కాగా శాటిలైట్ రూపంలో అలాగే డబ్బింగ్ రూపం లో , రీమేక్ ల రూపంలో మిగతా పది కోట్లు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . చాలాకాలం తర్వాత రాజశేఖర్ కు సూపర్ హిట్ రావడంతో రాజశేఖర్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది .
Comments

FOLLOW
 TOLLYWOOD