నైజాం లో లాభాలు తెస్తున్న గరుడ వేగ
TOLLYWOOD
 TOPSTORY

నైజాం లో లాభాలు తెస్తున్న గరుడ వేగ

Murali R | Published:November 20, 2017, 11:52 AM IST

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ చాలాకాలం తర్వాత నటించిన చిత్రం '' గరుడ వేగ '' . నవంబర్ ౩న రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది . కేవలం కోటి రూపాయలు అడ్వాన్స్ గా మాత్రమే ఇచ్చి నైజాం లో రిలీజ్ చేసారు కట్ చేస్తే నైజాం లో మంచి వసూళ్ళ ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది గరుడ వేగ చిత్రం.

డాక్టర్ రాజశేఖర్ కు చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ లభించడమే కాకుండా ఏకంగా రెండున్నర కోట్ల షేర్ రాబడుతూ షాక్ ఇస్తోంది . రాజశేఖర్ కు చాలాకాలం తర్వాత లభించిన సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది . తక్కువ పెట్టుబడి పెట్టిన బయ్యర్ కు లాభాలు వస్తున్నాయి గరుడ వేగ చిత్రంతో . ఇక ఓవర్ సీస్ లో కూడా రాజశేఖర్ కు మైల్ స్టోన్ గా నిలిచి పోనుంది గరుడ వేగ.
Comments

FOLLOW
 TOLLYWOOD