దువ్వాడ జగన్నాథం సెన్సార్ టాక్
TOLLYWOOD
 TOPSTORY

దువ్వాడ జగన్నాథం సెన్సార్ టాక్

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తయ్యాయి . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక నిన్న జరిగిన సెన్సార్ ని బట్టి దువ్వాడ జగన్నాధం హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు . ఫస్టాఫ్ యావరేజ్ గానే ఉన్నపటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరి పోయేలా ఉందని అంటున్నారు.

అలాగే ఎంటర్ టైన్మెంట్ , అల్లు అర్జున్ - పూజా హెగ్డే ల మధ్య రొమాన్స్ , అల్లు అర్జున్ డ్యాన్స్ , యాక్షన్ సీక్వెన్స్ , ప్రీ క్లైమాక్స్ వెరసి దువ్వాడ జగన్నాథం హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు . అయితే ఏ రేంజ్ హిట్ అన్నది తేలాలంటే రిలీజ్ అయితే కానీ తెలీదు . మొత్తానికి డీజే సౌండ్ పేలిపోవడం ఖాయమని అంటున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD