జబర్దస్త్ ఆది పై వదంతులు
TOLLYWOOD
 TOPSTORY

జబర్దస్త్ ఆది పై వదంతులు

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
జబర్దస్త్ షోలో హాస్యంతో అలరిస్తున్న ఆది పై వదంతులు స్ప్రెడ్ కావడంతో అవన్నీ తప్పుడు వార్తలని నాకు పెళ్లి కాలేదని ఖండిస్తున్నాడు ఆది . హైపర్ ఆది గా బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్న ఆది తాజాగా ఓ సినిమాలో పెళ్లి సీన్ లో నటించాడు అయితే ఆ ఫోటో లీక్ కావడంతో నిజంగానే ఆది రహస్య వివాహం చేసుకున్నాడు అంటూ కథనాలు రాసారు . ఈ విషయం ఆది కి తెలియడంతో మీడియా ముందుకు వచ్చి నాకు పెళ్లి కాలేదు , నాకంత సమయం లేదు ప్రస్తుతం నా ద్రుష్టి అంతా నటన మీదే అంటూ చెప్పుకొచ్చాడు .
 
 

అంతేకాదు నాది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుంది అని కొసమెరుపు కూడా ఇచ్చాడు . జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన ఆది పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు . Image result for false news on hyper aadi
Comments

FOLLOW
 TOLLYWOOD