అబ్బబ్బా .... బూతులు బూతులు
TOLLYWOOD
 TOPSTORY

అబ్బబ్బా .... బూతులు బూతులు

Murali R | Published:December 13, 2017, 4:18 AM IST

ఒకరేమో ప్రజాప్రతినిధి పైగా మహిళానేత , మరొకరు నిర్మాత , నటుడు కూడా కానీ ఈ ఇద్దరూ కలిసి బూతులు తిట్టుకుంటూ సదరు టివి ఛానల్ వాళ్లకు పండగ చేసారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది . ఓ టివి ఛానల్ లైవ్ కార్యక్రమంలో ఇదంతా జరగడం సంచలనం సృష్టిస్తోంది . ఇంతకీ బూతులు తిట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా ....... ఎవరి గురించో తెలుసా ...... తిట్టుకున్న వాళ్ళు రోజా , బండ్ల గణేష్ లైతే పవన్ కళ్యాణ్ కు బండ్ల సపోర్ట్ చేయగా జగన్ తరుపున వకాల్తా పుచ్చుకుంది రోజా . 

బండ్ల గణేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే , ఇక రోజా వైసిపి లో ఫైర్ బ్రాండ్ దాంతో వారసత్వ రాజకీయాలపై చర్చ లో పాల్గొని తిట్టుకున్నారు . ఇంకేముంది ఈ ఇద్దరూ గొడవ పడుతుంటే సదరు ఛానల్ వాళ్ళు పండగ చేసుకున్నారు . అగ్గి రాజేయడం ఆనందం పొందడం వాళ్ళ పని అందుకే ఉత్సాహపడ్డారు . మొత్తానికి రోజా తిట్ల పురాణంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD