ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు ఎన్టీఆర్ కి
TOLLYWOOD
 TOPSTORY

ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు ఎన్టీఆర్ కి

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
నాన్నకు ప్రేమతో చిత్రంలో అద్భుత నటన కు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు ని కైవసం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . 2016 లో వచ్చిన నాన్నకు ప్రేమతో పెద్ద హిట్ కాగా సరికొత్త ఎన్టీఆర్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆ సినిమా . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఉత్తమ సంగీత దర్శకుడి గా దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డు ని అందుకున్నాడు . 
 
 

హైదరాబాద్ లో నిన్న జరిగిన ఈవెంట్ లో ఎన్టీఆర్ కు ఈ అవార్డు ఇచ్చారు . ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . ఇక సమంత కూడా ఉత్తమ నటి అవార్డు ని అందుకుంది '' అ ...... ఆ '' చిత్రంలోని నటనకు గాను . 
Comments

FOLLOW
 TOLLYWOOD