హీరో నాగార్జున స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం
TOLLYWOOD
 TOPSTORY

హీరో నాగార్జున స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం

Murali R | Published:November 13, 2017, 8:04 PM IST
హీరో అక్కినేని నాగార్జున సొంత స్టూడియో అయిన అన్నపూర్ణ స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది , అన్నపూర్ణ స్టూడియోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు సెట్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి . దాంతో భారీ ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది అయితే అది ఏ స్థాయి నష్టం అన్నది తేలాల్సి ఉంది . అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం అని తెలియగానే హుటా హుటిన సుప్రియ , అలాగే నాగార్జున స్టూడియో కు చేరుకున్నారు.

ఈరోజు సాయంత్రం అయిదున్నర , ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టూడియో లో ఉన్న వాళ్ళని వెంటనే అప్రమత్తం చేసి బయటకు పంపించారు . అయితే సకాలంలో ఫైరింజన్ లు రాకపోవడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి . అయిదు ఫైరింజన్ లు వచ్చి నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి . ఇక నష్టం ఏమిటన్నది తేలాలి . అయితే ఈ భారీ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD