పాపం ! సూర్య సింగం 3
TOLLYWOOD
 TOPSTORY

పాపం ! సూర్య సింగం 3

Murali R | Published:February 13, 2017, 12:00 AM IST
సింగం 3 సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో సింగం 3 సీక్వెల్ చేసారు అయితే ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సింగం 3 కి మిశ్రమ స్పందన వస్తోంది . తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య కు పాపం తమిళనాట ఘోరంగా ఉంది పరిస్థితి . మూడు రోజుల్లో కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది . ఒక్క రోజులో వచ్చే షేర్ మూడు రోజుల్లో వచ్చిందంటే ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక తెలుగులో మాత్రం 5 కోట్ల షేర్ ని రాబట్టింది . సూర్య నటించిన 24 చిత్రం కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్ల ని రాబట్టింది.

ఇక ఇప్పుడేమో సింగం 3 తమిళం తో సమానంగా వసూళ్లు సాధిస్తోంది . అయితే ఈ వసూళ్లు అంత గొప్పగా లేవు సూర్య స్థాయికి తగ్గ వసూళ్లు కాకపోవడంతో బయ్యర్లు నష్టపోవడం ఖాయమని తెలుస్తోంది . నామమాత్రపు వసూళ్ల తో సూర్య సింగం 3 తేలిపోయింది.Comments

FOLLOW
 TOLLYWOOD