ఆ నాలుగు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో
TOLLYWOOD
 TOPSTORY

ఆ నాలుగు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
ఈరోజు శుక్రవారం కావడంతో బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి నాలుగు చిత్రాలు వస్తున్నాయి . అందులో మూడు చిత్రాలు తెలుగువి కాగా ఒక చిత్రం మాత్రం కన్నడ డబ్బింగ్ దాంతో ఈ నాలుగు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో అన్న ఆత్రుత నెలకొంది . ఈ నాలుగు చిత్రాల్లో ముందు వరుసలో ఉంది హీరో నిఖిల్ నటించిన '' కేశవ '' . రిలీజ్ కి ముందే కేశవపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి . దాంతో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం .
 
 

ఇక శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం కూడా ఈరోజు రిలీజ్ అవుతోంది . భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించాడు . అలాగే హరనాధ్ పొలిచర్ల నటించిన టిక్ టాక్ తో పాటు కన్నడ చిత్రం ఉపేంద్ర నటించిన '' కల్పన 3'' కూడా రిలీజ్ అవుతోంది . మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే కొద్దీ గంటలు ఆగాల్సిందే . 
Comments

FOLLOW
 TOLLYWOOD