యంగ్ డైరెక్టర్ కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నాగ్ ,నాని
TOLLYWOOD
 TOPSTORY

యంగ్ డైరెక్టర్ కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నాగ్ ,నాని

Murali R | Published:October 21, 2017, 10:37 AM IST
భలే మంచి రోజు చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య అనే యంగ్ డైరెక్టర్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు కింగ్ నాగార్జున , న్యాచురల్ స్టార్  నాని లు . భలే మంచి రోజు చిత్రం తర్వాత శమంతకమణి చిత్రానికి దర్శకత్వం వహించాడు శ్రీరామ్ ఆదిత్య . రెండు చిత్రాలతో దర్శకుడిగా తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు దాంతో నాగార్జున -నాని లు ఛాన్స్ ఇచ్చారు . ఒకరు ఛాన్స్ ఇవ్వడమే గొప్ప అంటే ఇద్దరు స్టార్ లు ఛాన్స్ ఇవ్వడం అంటే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే ! ఈ ఇద్దరు స్టార్ లకు తోడు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం . 
 
 
తంతే బూరెల బుట్టలో పడ్డట్లుగా శ్రీరామ్ ఆదిత్య కు మూడో సినిమాతోనే మంచి ఛాన్స్ లభించింది . కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది . దీపావళి  సందర్బంగా ఈ విషయాన్నీ ప్రకటించారు ఆ చిత్ర నిర్మాణ సంస్థ . వరుస హిట్ లతో నాగార్జున , నాని లు జోష్ గా ఉన్నారు పైగా ఈ ఇద్దరూ కలిసి నటించడం అంటే అభిమానులకు , ప్రేక్షకులకు ఆనందమే ఆనందం .Comments

FOLLOW
 TOLLYWOOD