ఆ సినిమా హిట్ అయితేనే హీరో కెరీర్ కి ఆక్సిజన్
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా హిట్ అయితేనే హీరో కెరీర్ కి ఆక్సిజన్

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST
హీరో గోపీచంద్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు . లౌక్యం తర్వాత హిట్ అనేది తెలీకుండా ఇబ్బంది పడుతున్నాడు . ఇటీవల రిలీజ్ అయిన గౌతమ్ నంద ప్లాప్ అయ్యింది , స్టైలిష్ సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడం వల్ల రైటర్న్స్ సగం కూడా రాకపోవడంతో పాపం ! ఆ నిర్మాతలు నష్టపోయారు  గోపీచంద్ కు కూడా అంతగా పేరు రాలేదు పాపం .
 
 

ఇక మరో పాత సినిమా ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కాకుండా మూలనపడింది . ఇక ఇప్పుడేమో ఆక్సిజన్ రిలీజ్ కి రెడీ అయ్యింది . ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువయ్యింది దాంతో రిలీజ్ కి ఇబ్బంది పడుతూ మొత్తానికి వచ్చేనెలలో రిలీజ్ కి సిద్ధం అవుతోంది . ఈ సినిమా హిట్ అయితే గోపీచంద్ కెరీర్ కి ఆక్సిజన్ అందుతుంది లేదంటే మరింతగా ఇబ్బందుల్లో పడటం ఖాయం . గోపీచంద్ కూడా ఈ ఆక్సిజన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . హిట్ అయితే కెరీర్ గాడిలో పడుతుందన్న ఆశతో ఉన్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD