పాపం .... అది కూడా డిజాస్టర్ అయింది
TOLLYWOOD
 TOPSTORY

పాపం .... అది కూడా డిజాస్టర్ అయింది

Murali R | Published:December 12, 2017, 1:53 PM IST

హీరో గోపీచంద్ కు అసలు టైం బాగా లేనట్లుంది. గతకొంత కాలంగా గోపీచంద్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. లౌక్యం సినిమా హిట్ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆక్సిజన్ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే టాక్ కాస్త బాగానే వచ్చినప్పటి కీ సినిమాకు కలెక్షన్లు మాత్రం లేకుండాపోయాయి. పది రోజుల లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ రాబట్టిందో తెలుసా ......

 

నాలుగున్నర కోట్లు మాత్రమే. అంటే సినిమా బడ్జెట్ లో ఒక వంతు కూడా వసూల్ చేయలేకపోయింది. అసలే ఆక్సిజన్ సినిమా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ మరింత పెరిగింది, కానీ ఆ స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది. ఏ ఎం రత్నం తనయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్ గోపీచంద్ కు కానీ ఏ ఎం రత్నం కు కానీ ఆక్సిజన్ అందించలేకపోయింది.
Comments

FOLLOW
 TOLLYWOOD