మళ్ళీ ఆ సినిమా వాయిదాపడింది
TOLLYWOOD
 TOPSTORY

మళ్ళీ ఆ సినిమా వాయిదాపడింది

Murali R | Published:October 21, 2017, 5:13 PM IST
ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడిన చిత్రం '' ఆక్సీజన్ ''. గోపీచంద్ హీరోగా నటించిన ఆ చిత్రంలో మెహరీన్ కౌర్ , రాశి ఖన్నా లు హీరోయిన్ లుగా నటించారు . అయితే బడ్జెట్ ఎక్కువ కావడం , గోపీచంద్ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో కూడా మొత్తానికి ఆక్సీజన్ రిలీజ్ వాయిదాపడింది . ఎట్టకేలకు ఈనెల 27న రిలీజ్ చేయడం ఖాయమని అన్నారు కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఆక్సీజన్ చిత్రం వాయిదాపడినట్లు తెలుస్తోంది . ఈనెల 27న కాకుండా వచ్చే నెల నవంబర్ 10న సినిమాని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట.

ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు ఈ ఆక్సీజన్ చిత్రానికి . ఈ సినిమా హిట్ పై హీరో గోపీచంద్ తో పాటుగా దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఆక్సీజన్ సినిమా హిట్ అయితేనే ఇద్దరి కెరీర్ కి ఆక్సీజన్ అందుతుంది . లేదంటే కెరీర్ లో వెనుకబడటం ఖాయం.Comments

FOLLOW
 TOLLYWOOD