కొడుకు పుట్టడంతో సంతోషంగా ఉన్న డైరెక్టర్
TOLLYWOOD
 TOPSTORY

కొడుకు పుట్టడంతో సంతోషంగా ఉన్న డైరెక్టర్

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
యువ దర్శకులు హను రాఘవపూడి తండ్రి గా ప్రమోషన్ అందుకున్నాడు . నిన్న హను భార్య డాక్టర్ అమూల్య పండంటి మగబిడ్డ కు జన్మనివ్వడంతో ఆ కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది . అసలే లై సినిమా రిలీజ్ కి ఉంది ఆ కార్యక్రమాల్లో టెన్షన్ గా బిజీ గా ఉన్నాడు హను సరిగ్గా అదే సమయంలో కొడుకు పుట్టాడని తెలియడంతో హను టెన్షన్ అంతా పోయి సంతోషం వెల్లివిరిసింది .
 

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడి పరిచయం అయినప్పటికీ , కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో మాత్రమే సక్సెస్ అందుకున్నాడు హను . ఇక ఇప్పుడేమో నితిన్ తో లై అంటున్నాడు . రేపే ఈ సినిమా రిలీజ్ దాంతో మరింత సంతోషంగా ఉన్నాడు . బిడ్డొచ్చిన వేళా విశేషం తప్పకుండా హిట్ కొడతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD