హ్యాపీ బర్త్ డే మహేష్
TOLLYWOOD
 TOPSTORY

హ్యాపీ బర్త్ డే మహేష్

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. దాంతో కృష్ణ - మహేష్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. రాజకుమారుడు చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన మహేష్ కు మొదట నల్లేరు మీద నడక ఏమి కాలేదు. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ , మద్దతుగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మొదట్లో ప్లాప్ లనే ఎదుర్కొన్నాడు మహేష్.

అయితే ఎంతో కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరచుకోవడానికి మహేష్ కు కొంతకాలం పట్టింది. ఎట్టకేలకు ఒక్కడు సినిమాతో స్టార్ డం అందుకున్నాడు . ఇక ఒక్కడు తర్వాత మహేష్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు. తాజాగా స్పైడర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ పుట్టినరోజు ఈరోజు కావున మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టాలీవుడ్.
Comments

FOLLOW
 TOLLYWOOD