నన్ను వాడుకోమని సలహా ఇస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

నన్ను వాడుకోమని సలహా ఇస్తోంది

Murali R | Published:March 19, 2017, 12:00 AM IST
నన్ను వాడుకోవచ్చుగా , నాలాంటి వాళ్ళని వాడుకోకుండా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంచిమంచి పాత్రలు ఇస్తున్నారు అదే పాత్ర మాకిస్తే మేము చేయలేమా ? అంటూ దర్శకులు పూరి జగన్నాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ . హీరో తల్లి పాత్రలకు ఎక్కడెక్కడి నుండో ఎవరెవరినో తీసుకొస్తున్నారు ఆ ఛాన్స్ నాకిస్తే హీరోకు తల్లిగా నటించలేనా ? ఆ స్టేచర్ నాకు లేదా ? అంటూ పూరి పై ఫైర్ అవుతోంది హేమ . తెలుగులో గత 25 ఏళ్లుగా నటిగా పలు రకాల పాత్రలను పోషించానని అయినప్పటికీ పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు ఇంకా చిన్న చూపు చూస్తున్నారని అంటోంది .
 
 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న హేమ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టింది . గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది కూడా . దాంతో రాజకీయాలను పక్కన పెట్టిన ఈ భామ ప్రస్తుతం బుద్దిగా సినిమాలు చేసుకుంటోంది . అయితే అగ్ర హీరోలకు తల్లిగా నటిస్తానని అంటోంది కానీ దర్శకులే ఆ ఛాన్స్ లు ఇవ్వడం లేదు . 
Comments

FOLLOW
 TOLLYWOOD