హిట్స్ కంటే ఫ్లాప్ లే ఎక్కువ అని ఒప్పుకున్న హీరో
TOLLYWOOD
 TOPSTORY

హిట్స్ కంటే ఫ్లాప్ లే ఎక్కువ అని ఒప్పుకున్న హీరో

Murali R | Published:October 22, 2017, 6:17 PM IST
తన కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్ చిత్రాలే ఎక్కువని ఒప్పుకున్నాడు హీరో రామ్ . దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రామ్ తాజాగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో '' ఉన్నది ఒకటే జిందగీ '' అనే చిత్రం చేస్తున్నాడు . ఈనెల 27 న ఉన్నది ఒకటే జిందగీ చిత్రం రిలీజ్ అవుతోంది . అయితే రామ్ ఇప్పటివరకు పద్నాలుగు చిత్రాల్లో నటిస్తే అందులో అయిదు చిత్రాలు దేవదాస్ , రెడీ ,కందిరీగ , పండగ చేస్కో  , నేను శైలజ మాత్రమే హిట్ అయ్యాయి ....... మిగతా చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి . 
 
 
ఇక ఇప్పుడు 15 వ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది , అదే ఈ ఉన్నది ఒకటే జిందగీ . ఈ సినిమాకు కూడా నేను శైలజ వంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకుడు కాబట్టి ఆ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు రామ్ . నా మనసుకి బాగా దగ్గరైన సినిమా తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా ఉందని అంటున్నాడు . రామ్ నమ్మకం ఎలా ఉన్నప్పటికీ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది మరి . ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరో అయిదు రోజులు ఆగాల్సిందే .Comments

FOLLOW
 TOLLYWOOD