రాశి ఖన్నా బ్యాక్ చూసి ఫిదా అయిపోయాడట
TOLLYWOOD
 TOPSTORY

రాశి ఖన్నా బ్యాక్ చూసి ఫిదా అయిపోయాడట

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

అందాల బొమ్మ రాశి ఖన్నా బ్యాక్ చూసి ఫిదా అయిపోయాడట రామ్ ! దాంతో ఆమె ముఖం చూస్తే అంతగా గుర్తు పడతాడో లేదో కానీ బ్యాక్ చూస్తే ....... సారీ ...... బ్యాక్ నుండి చూస్తే మాత్రం తప్పనిసరిగా గుర్తు పడతాడట ఈ విషయాన్నీ రామ్ స్వయంగా తెలిపాడు.  అయితే బ్యాక్ అనగానే మరోలా అనుకోవద్దని బ్యాక్ నుండి చూస్తే గుర్తు పడతాను అన్నది డైలాగ్ అని వివరణ ఇస్తున్నాడు రామ్ . తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ - రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం ''హైపర్ ''. ఈ చిత్రం ఈనెల 30న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ హైపర్ చిత్ర విశేషాలను వెల్లడించాడు . నాన్నంటే పిచ్చి ఉన్న హీరో కథ మా హైపర్ అని , అయితే నా కోసమే ఈ టైటిల్ పెట్టారేమో అన్న అనుమానం అందరికి రావచ్చని కానీ కథ కు తగ్గ టైటిల్ అలాగే మా దర్శకులు , నిర్మాతలకు కూడా హైపర్ ఉందని అంటున్నాడు . ఇక పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోడట , దానికి ఇంకా టైం ఉంది అని అంటున్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD