ఉన్నది ఒకటే జిందగీ తో రామ్ హిట్ కొడతాడా
TOLLYWOOD
 TOPSTORY

ఉన్నది ఒకటే జిందగీ తో రామ్ హిట్ కొడతాడా

Murali R | Published:October 25, 2017, 1:28 PM IST
నేను శైలజ సూపర్ హిట్ అయినప్పటికీ కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆలస్యం కూడా చేసాడు రామ్ , దాంతో ఉన్నది ఒకటే జిందగీ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టింది . మొత్తానికి ఈనెల 27న రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్ అవుతోంది . ఈ సినిమాపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు , సినిమా రంగానికి వచ్చిన తర్వాత నేను చేయాలో నాకు తెలియజెప్పింది ఈ సినిమా అంటూ బోలెడు కబుర్లు చెబుతున్నాడు అంతేకాదు ఇదే పక్కాగా హిట్ అయ్యే సినిమా అని చెబుతున్నాడు . 
 
 
 
నేను శైలజ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి , యూత్ ని ఆకట్టుకునే సినిమా అని బలంగా నమ్ముతున్నారు ఆ చిత్ర బృందం . ఇక రామ్ అయితే డ్యామ్ షూర్ హిట్ అని ఆశగా ఉన్నాడు , అతడి ఆశలకు అనుగుణంగా ఉన్నది ఒకటే జిందగీ హిట్ అవుతుందా ? ప్లాప్ అవుతుందా ? తెలియాలంటే రెండు రోజులు ఎదురు చూడాల్సిందే . Comments

FOLLOW
 TOLLYWOOD