హీరో సుశాంత్ ఇంట విషాదం
TOLLYWOOD
 TOPSTORY

హీరో సుశాంత్ ఇంట విషాదం

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
యంగ్ హీరో సుశాంత్ తండ్రి మరణించడంతో ఆ ఇంట విషాదం నెలకొంది . నాగార్జున సోదరి నాగ సుశీల భర్త అనుమోలు సత్య భూషణరావు (68) గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డాడు , అయితే ఈరోజు ఉదయం కన్నుమూయడంతో అక్కినేని ఇంట విషాదం నెలకొంది . సత్య భూషణరావు తండ్రి ప్రసాద్ ఆర్ట్  పిక్చర్స్  అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు తనయుడు.

సత్య భూషణరావు మరణవార్త తెలియగానే అక్కినేని , ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కుటుంబాల సన్నిహితులు , బంధు మిత్రులు సత్య భూషణరావు పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు . నాగార్జున కు స్వయానా బావ కావడంతో ఆ కుటుంబం లో కూడా విషాదం నెలకొంది . దాంతో ఈరోజు జరగాల్సిన రారండోయ్ వేడుక చూద్దాం వేడుకని వాయిదా వేశారు.Comments

FOLLOW
 TOLLYWOOD