అఖిల్ కోసం వెంకటేష్
TOLLYWOOD
 TOPSTORY

అఖిల్ కోసం వెంకటేష్

Murali R | Published:October 11, 2017, 6:14 PM IST
అక్కినేని అఖిల్ తాజాగా '' హలో '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రం కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . యాక్షన్ తో కూడిన ప్రేమకథా చిత్రంగా హలో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విక్రం కుమార్ . ప్రముఖ నటి లిజి దర్శకుడు ప్రియదర్శన్ ల కూతురు అయిన కళ్యాణి ప్రియదర్శిని ని ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు . డిసెంబర్ 22న భారీ ఎత్తున హలొ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 
 
 
కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం వెంకటేష్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట . వెంకటేష్ కు కూడా అఖిల్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే అఖిల్ కోసమైనా హలో చిత్రంలో వెంకటేష్ నటించడం ఖాయమని అంటున్నారు . దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాలంట . అఖిల్ - వెంకటేష్ ల కాంబినేషన్ ప్రేక్షకులను అలరించడం ఖాయమేమో చూడాలి . Comments

FOLLOW
 TOLLYWOOD