ప్రతీకారం తీర్చుకున్న హీరో
TOLLYWOOD
 TOPSTORY

ప్రతీకారం తీర్చుకున్న హీరో

Murali R | Published:October 16, 2017, 2:03 PM IST
సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం కొన్ని వెబ్ సైట్లు పూర్తి సినిమాని లేదా కొన్ని కీలక సన్నివేశాలని సైట్ లో పెడుతూ చిత్ర పరిశ్రమ ని నాశనం చేస్తున్నాయి దాంతో తమిళ స్టార్ హీరో విజయ్ తన తాజా చిత్రం మెర్సల్ కు ఆ పరిస్థితి ఎదురు కాకూడదని తమిళనాడు హై కోర్టు ని ఆశ్రయించాడు . కోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని దేశ వ్యాప్తంగా సినిమా రిలీజ్ రోజునే పూర్తి సినిమాని నెట్ లో పెడుతున్న 2650 వెబ్ సైట్ల ని బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది . ఆ వెబ్ సైట్ల కు ప్రొవైడ్ చేస్తున్న 37 ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ల కు ఈ ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు.

విజయ్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న మెర్సల్ లో ముగ్గురు కథానాయికలు ...... సమంత , కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ లు . దీపావళి కానుకగా ఈనెల 18న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . పైరసీ పెద్ద భూతం లా చిత్ర పరిశ్రమని పట్టి పీడిస్తోంది మరి ఈ పరిస్థితిలో హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటే పైరసి ఆగిపోతుందా చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD